SRH vs KKR : స్వల్ప ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్(kkr)తొలి వికెట్ పడింది. దంచికొడుతున్న రహ్మనుల్లా గుర్బాజ్(23)ను నటరాజన్ వెనక్కి పంపాడు. కవర్స్‌లో షాట్ ఆడబోయిన గుర్జాబ్.. వియస్కాంత్ చేతికి చిక్కాడు. దాంతో, 44 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ సునీల్ నరైన్(17), వెంకటేశ్ అయ్యర్(12)లు ఆడుతున్నారు. పవర్ ప్లేలో స్కోర్.. 63/1. ఇంకా కేకేఆర్ విజయానికి 97 పరుగులు కావాలి.
తొలుత ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫైనల్ బెర్తును నిర్ణయించే క్వాలిఫయర్ 1లో ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(3/22) విజృంభణతో హిట్టర్లంతా డగౌట్ చేరిన చోట.. రాహుల్ త్రిపాఠి(55) అర్ధ సెంచరీతో కదం తొక్కాడు. హెన్రిచ్ క్లాసెన్(32)లతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(30), అబ్దుల్ సమద్(16)ల మెరపులతో హైదరాబాద్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. కోల్‌కతాకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.