Wolrd Cup Star : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver Brunt) పరుగుల వరద పారిస్తోంది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకుంటూ.. భారీ స్కోర్లు అందిస్తున్న బ్రంట్ శ్రీలంకపై విధ్వంసక శతకంతో రెచ్చిపోయింది. సుగంధ కుమారి ఓవర్లో సిక్సర్‌తో వరల్డ్ కప్‌లో ఐదో సెంచరీ సాధించింది. మూడంకెల స్కోర్ అందుకోగానే ఆమె ప్రత్యేకంగా సంబురాలు చేసుకుంది. బ్యాట్‌ను ఊయల మాదిరిగా ఊపుతూ ‘క్రాడిల్ సెలబ్రేషన్’ తో తన సెంచరీని ముద్దుల కుమారుడికి అంకితమిచ్చిందీ కెప్టెన్. ఇంతకూ ఆమె బిడ్డను ఎవరితో కన్నదో తెలుసా.. క్యాథరీన్ బ్రంట్ (Catherin Brunt) అనే మరో మహిళా క్రికెటర్‌తో. అదేంటీ అని నోరెళ్లబెడుతున్నారా? అయితే.. వీరి కథ చదవాల్సిందే.
ఈమధ్య కాలంలో స్వలింగ వివాహాలకు పలు దేశాలు ఆమోద ముద్ర వేశాయి. దాంతో.. పలువురు మనసుకు నచ్చిన మరో మహిళతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఎందుకనో క్రికెటర్లలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టులోనే స్వలింగ జంటలు ఉన్నాయి. నాట్ సీవర్ బ్రంట్, క్యాథరీన్ బ్రంట్ జోడీ కూడా అలాటిందే. జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2017లో వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) గెలుపొందిన తర్వాత తమ బంధాన్ని మరో మెట్టుఎక్కిస్తూ 2018లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాయి ప్రేమ పక్షులు.
నాలుగేళ్ల తర్వాత.. 2022 మే నెలలో సన్నిహితులు సమక్షంలో క్యాథరీన్, నాట్ సీవర్ పెళ్లి చేసుకున్నారు. తమ అనుబంధానికి గుర్తుగా ఒక బుజ్జాయిని కనాలనుకున్నారు. అనుకున్నట్టే ఈ ఏడాది మార్చిలో బ్రంట్ జంట మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ క్యాథరీన్ నేను మేము కుటుంబ జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. పేరంటింగ్ బాధ్యతల్ని చూసుకుంటూనే క్రికెటర్‌గా రాణిస్తాను అని బ్రంట్ తాము బిడ్డను కనేందుకు సిద్ధమవుతున్నామని చెప్పింది.
సంతానం కలగాలంటే దంపతులు స్త్రీ, పురుషుల మాత్రమే అయి ఉండాలి. కానీ, ఇది ఒకప్పటి మాట. సాంకేతికత కృత్రిమ గర్భధారణ (IVF) విధానం అందుబాటులోకి వచ్చాక.. ప్రత్యక్షంగా పురుషుల ప్రమేయం.. అంటే శృగారంలో పాల్గొనకపోయిన బిడ్డను కనే పరిస్థితులు వచ్చాయి. ఈ విధానంలో భాగస్వాముల్లో ఒకరు అండాలను దానం చేస్తే.. మరొకరు గర్భం దాల్చేందుకు సిద్దమవుతారు. అనంతరం వీర్య దాత (Sperm Donor)గా ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వైద్యులు దాత వీర్యంను, అండంతో లేదంటే ‘ఫ్రీజింగ్ ఎగ్స్’ (Freezing Eggs)తో ఫలదీకరణం చెందించి.. బిడ్డను మోయాలనుకుంటున్న మహిళ యుటెరస్ ద్వారా లేదంటే కృత్రిమ ఫలదీకరణ పద్ధతిలో గర్భంలోకి ప్రవేశపెడుతారు.
ఈ రెండు విధానాల్లో లెస్బీనియన్ జంట పేరంట్స్ అవుతారు. నాట్ సీవర్ క్యాథరీన్ జంట కూడా ఇలానే మగ బిడ్డను కన్నది. బ్రంట్ విషయానికొస్తే.. ఆమె భాగస్వామి క్యాథరీన్ బిడ్డను కడుపున మోసేందుకు అంగీకరించింది. దాంతో బ్రంట్ 2024లో తన ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో తన అండాలను భద్రపరచుకుంది. వీర్య దాతను ఎంచుకున్న తర్వాత క్యాథరీన్ గర్భం దాల్చింది. మార్చిలో తాము పేరంట్స్ కాబోతున్నామనే విషయాన్ని పంచుకున్నారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కలలపంటకు ‘థియోడొరె మైఖేల్ సీవర్ బ్రంట్’ అని పేరు పెట్టుకుందీ జంట. వైద్యపరిభాషలో ఈ గర్భధారణను ‘రెసీప్రోకల్ ఐవీఎఫ్’ (Reciprocal IVF) అని అంటారు.
What a way to bring up a #CWC25 ton, Nat Sciver-Brunt 🙌
Watch #ENGvSL LIVE in your region, broadcast details here ➡️ https://t.co/7wsR28PFHI pic.twitter.com/3cj5BkDLnV
— ICC (@ICC) October 11, 2025
బ్రంట్ జంటే కాదు మహిళా క్రికెటర్లలో చాలామంది స్వలింగ బంధాన్నే కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్‌కే చెందిన సారా టేలర్, డయాని మైన్‌తో వివాహబంధంలో ఉంది. వీరిద్దరు లారీ అనే అబ్బాయి జన్మనిచ్చారు. డానీ వ్యాట్ ఫుట్‌బాల్ ఏజెంట్ అయిన జార్జియా హొడ్గేను 2024లో మనువాడింది.దక్షిణాఫ్రికా క్రికెటర్ మరినే కాప్ (Marizanne Kapp) 2018లో మాజీ కెప్టెన్ అయిన డానేవాన్ నీకెర్క్తో వివాహబంధంలో అడుగుపెట్టింది.
England star Danielle Wyatt announces her engagement with Georgie Hodge ❤️
Congratulations you both 💍😍#CricketTwitter 📸 @Danni_Wyatt pic.twitter.com/AeThXut96D
— Female Cricket (@imfemalecricket) March 2, 2023
England’s Amy Jones and Australia’s Piepa Cleary announce their engagement 💍❤️ #CricketTwitter 📸Amy Jones pic.twitter.com/51QuaBKhRW
— Female Cricket (@imfemalecricket) July 22, 2024
Australia’s women cricketers Delissa Kimmince and Laura Harris tied the knot on Sunday and shared the news of their wedding on Instagram.
Congratulations you two ❤️
📸delissa_kimmince / Instagram pic.twitter.com/YcEIY1Edh3
— Female Cricket (@imfemalecricket) August 17, 2020
న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, అమీ సాటెర్వైట్ను పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక పాప కూడా ఉంది. ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షట్- జెస్ జొనాసెన్‌లు సైతం సహజీవనంలో ఉన్నారు. వీరంతా.. ప్రేమే ముఖ్యమని తమ భాగస్వామిని ఎంచుకున్నారు. పెళ్లితో అన్యోన్యంగా జీవిస్తున్నారు.
#OnThisDay in 2018,
Marizanne Kapp and Dane Van Niekerk tied the knot😍❤️#CricketTwitter pic.twitter.com/GTZoWiWoZK
— Female Cricket (@imfemalecricket) July 6, 2022
తన వరల్డ్ కప్ సెంచరీని బ్రంట్ తమ కుమారిడికి అంకితమిస్తూ క్రాడిల్ సెలబ్రేషన్ చేసుకోగా.. గ్యాలరీ నుంచి క్యాథరీన్ తెగ సంబురపడిపోయింది. 39 ఏళ్ల క్యాథరీన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అన్నిఫార్మాట్లలో కలిపి 335 వికెట్లు పడగొట్టిన ఈ మాజీ పేసర్.. అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
No other player has more hundreds in Women’s World Cups than Nat Sciver-Brunt.
A sensational innings from the England captain in Colombo.#EnglandCricket #WomensWorldCup pic.twitter.com/NDODMq0uu2
— Wisden (@WisdenCricket) October 11, 2025