PAKW vs SAW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం అంతరాయం తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(0) సున్నాకే ఔటైనా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(56 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. పాక్ బౌలర్లను ఉతికేసిన ఈ ద్వయం రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత నష్ర బౌలింగ్‌లో.. డయానా చేతికి క్యాచ్ ఇచ్చి లుస్ వెనుదిరిగింది. దాంతో.. 123 వద్ద సఫారీ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లోనే వొల్వార్డ్త్ బౌండరీతో అర్ధ శతకం పూర్తి చేసుకుంది.
శ్రీలంక గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అడ్డుపడుతున్న వరుణుడు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. సఫారీల జట్లు బ్యాటింగ్ సమయంలో రెండో ఓవర్ పూర్తి కాగానే వాన మొదలైంది. 40 నిమిషాల తర్వాత వాన తగ్గడంతో సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశారు.
50 for Sune Luus ✅
50 for Laura Wolvaardt ✅ pic.twitter.com/BepzsiF7B5— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2025
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించగా.. 6/1తో తిరిగి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(56 నాటౌట్), సునే లుస్(61)లు దూకుడుగా ఆడారు. రన్ రేటు 7కు తగ్గకుండా చూస్తూ.. బౌండరీలతో చెలరేగిన ఈ ద్వయం శతక భాగస్వామ్యంతో గట్టి పునాది వేసింది. కెప్టెన్ లారాకు జతగా అనెరీ డెర్క్సెన్(8 నాటౌట్) క్రీజులో ఉంది. 20 ఓవర్లకు స్కోర్.. 139-2.