Narinder Batra | మూడు కీలక పదవుల నుంచి తప్పుకున్న నరీందర్ బత్ర
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వేర్వేరు అత్యున్నత క్రీడా సంఘాలలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన మూడింటి నుంచి తప్పుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ), ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లలో కీలక బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు.
నరీందర్ బత్ర.. ఐవోఏ, ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఉండగా ఐవోసీలో కీలక సభ్యుడి (కౌన్సిల్ మెంబర్)గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు పదవులకు ఆయన ఏకకాలంలో రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తన రాజీనామా లేఖలను సంబంధిత అధికారులకు పంపారు. తన స్వహస్తాలతో రాసిన రాజీనామా లేఖలను ఆయన ఐవోఏ, ఎఫ్ఐహెచ్, ఐవోసీ లకు పంపించారు.
‘వ్యక్తిగత కారణాల రీత్యా నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను. ఇన్నాళ్లు మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు’ అని లేఖలలో పేర్కొన్నారు. బత్ర.. ఐవోఏ లో 2017 నుంచి, ఎఫ్ఐహెచ్ కు 2021 నుంచి అధ్యక్షుడిగా (రెండోసారి) కొనసాగుతున్నారు. ఐవోసీలో కౌన్సిల్ మెంబర్ గా 2019 లో ఎన్నికయ్యారు.
కాగా ఐవోసీలో ఆయనను ‘లైఫ్ టైమ్ మెంబర్’ గా నియమించడం నేషనల్ స్పోర్ట్స్ కోడ్ కు వ్యతిరేకంగా ఉందని ఇటీవలే ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. దీంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు.
Narinder Batra steps down as IOA president and IOC Council member. #NarinderBatraQuits pic.twitter.com/L24NZHchGx
— Koushik Paul (@KoushikPaul1994) July 18, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- fih
- IOA
- IOC
- Narinder Batra
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

