T20 World Cup 2026 : పొట్టి ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నమెంట్ కోసం అనుభవజ్ఞులకు పెద్దపీట వేయడం చూశాం. కానీ, నమీబియా (Namibia) మాత్రం కుర్రాళ్లకే జై కొట్టింది. కేవలం 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవమే ఉన్న యువకులను వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తీసుకుంది. గెర్హార్డ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) కెప్టెన్‌గా శనివారం 15 మంది సభ్యులను మెగా టోర్నీకి సెలెక్టర్లు ఎంపిక చేశారు. వీరిలో సీనియర్లు 10 మందికాగా.. ఐదుగురు క్రికెటర్లు పట్టుమని పది మ్యాచ్‌లే ఆడడం విశేషం.
ధనాధన్ ఆటతో వెలుగులోకి వచ్చిన నమీబియా యువ క్రికెటర్లు ఏకంగా వరల్డ్ కప్ బెర్తు పట్టేశారు. టీ20ల్లో విధ్వంసక ఆటగాడిగా పేరొందిన లౌరెన్ స్టీన్కాంప్ ఏడు మ్యాచుల్లో 126.85 స్ట్రయిక్ రేటు నమోదు చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్లు జాన్ బాల్ట్, డైలాన్ లీచెర్, విలియం సైతం దమ్మున్న కుర్రాళ్లే. ఇక పేస్ దళంలో 20 ఏళ్ల జాక్ బ్రస్సెల్ కీలకం కానున్నాడు. ఈ యువకెరటం ఇప్పటివరకూ 23 వన్డేలు, 40 టీ20లు ఆడాడు.
Our FNB Eagles are locked in for the ICC Men’s T20 World Cup, hosted in India & Sri Lanka.
Wishing the team and management the best as they fly the Namibian flag on the global stage.
Fans, get ready! ✈️🎟️
Travel packages to support the boys will be announced soon. pic.twitter.com/jtA5iV3aIa
— Official Cricket Namibia (@CricketNamibia1) January 3, 2026
జాన్ ఫ్రైలింక్, రుబెన్లు సైతం అనుభవంగల బౌలర్లే. నిరుడు అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయంలో భాగమైన మ్యాక్స్ హిన్గోకు సైతం ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు లభించింది. గ్రూప్ ఏలో ఉన్న నమీబియా ఫిబ్రవరి 10న తమ తొలి పోరులో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అనంతరం భారత్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, యూఎస్ఏలతో లీగ్ దశ మ్యాచ్‌లు ఆడనుంది.
నమీబియా టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : లౌరెన్ స్టీన్కాంప్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), విలియం మైబర్గ్, రూబెన్ ట్రంప్లెమన్, జన్ ఫ్రైలింక్, జనే గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జన్ నికొల్ లొఫ్టీ ఈటన్, జేజే స్మిత్, బెన్ షికాంగో, జన్ బాల్ట్, మ్యాక్స్ హీన్‌గో, మలాన్ క్రుగెర్, డైలాన్ లీచెర్, జక్ బ్రస్సెల్.
ఫిబ్రవరి 7వ తేదీన భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న భారత్ అన్ని బోర్డుల కంటే ముందే స్క్వాడ్‌ను వెల్లడించింది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డులు తమ బృందాలను వెల్లడించాయి. త్వరలోనే మిగతా బోర్డులు స్క్వాడ్లను ప్రకటించనున్నాయి.