ఇండోర్: బ్యాంకును మోసం చేసిన కేసులో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా తండ్రి వినయ్ ఓజాకు ఏడేండ్ల జైలుశిక్ష పడింది. 11 ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బేటూల్లో గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలో అవినీతికి సంబంధించిన కేసులో వినయ్‌ను దోషిగా తేల్చుతూ ముల్తాయ్ అడిషినల్ సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది.
ఆ సమయంలో వినయ్ ఓజా.. ముల్తాయ్‌లో గల శాఖకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేశారు.మరో నలుగురితో కలిసి ఆయన.. రూ. 1.25 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని కేసు నమోదైంది.