అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియా, స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి కోలుకోలేని దెబ్బతిన్న ఆ జట్టును ఆరో ఓవర్లో డేవిడ్ వీజే మరో దెబ్బకొట్టాడు. అతని బౌలింగ్‌లో స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ వాలేస్ (4) ఎల్బీగా అవుటయ్యాడు.
ఈ క్రమంలో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ జట్టు 22 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియాకు పేసర్ రూబెన్ ట్రంపెల్మన్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. తొలి ఓవర్లో రెండు వైడ్లు వేసిన మూడు వికెట్లు కూల్చాడు. ఆ ఓవర్లో అతను వేసిన వైడ్లు తప్ప స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.