హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంవీ మురళీ కృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణకు పదోన్నతి లభించినట్లు అయింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టాపొందిన మురళీ కృష్ణ..బీవోబీలో తన కేరియర్‌ను ప్రారంభించారు.