Guwahati Test : గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికాను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేయాలనుకున్న భారత జట్టు భంగపడింది. సిరీస్ సమం చేయాలనుకున్న టీమిండియాకు షాకిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది సఫారీ టీమ్. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. మిడిలార్డర్ కూడా పట్టుదలగా ఆడడంతో పర్యాటక జట్టు 489 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. సెనురన్ ముతుస్వామి(109) తొలి సెంచరీతో విరుచుకుపడగా.. ఆఖర్లో మార్కో యాన్సెస్ (93) మెరుపు అర్ధ శతకంతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. కుల్దీప్ యాదవ్(4-115) అతడిని బౌల్డ్ చేశాక.. భారత ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(7 నాటౌట్), కేఎల్ రాహుల్(2 నాటౌట్)లు అజేయంగా రెండో రోజును ముగించారు.
సిరీస్‌లో వెనకబడిన భారత జట్టు రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు కళ్లెం వేయాలనుకుంది. కానీ, గువాహటిలో సీన్ రివర్సైంది. తొలి రోజు ఓపికగా ఆడిన సఫారీ బ్యాటర్లు.. రెండో రోజు అంతకుమించిన పట్టుదలను ప్రదర్శించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ సమిష్టిగా రాణించగా దక్షిణాఫ్రికా 489 పరుగులతో టీమిండియాకు సవాల్ విసిరింది.
Innings Break!
Kuldeep Yadav leads the way with a 4⃣-fer 👌
2⃣ wickets each for Jasprit Bumrah, Mohd. Siraj, and Ravindra Jadeja 👏Over to our batters now!
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/dsdCS1riU6
— BCCI (@BCCI) November 23, 2025
మొదటి రోజు తొలి సెషన్లో టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సఫారీ ఓపెనర్లు రియాన్ రికెల్టన్(35), ఎడెన్ మర్క్రమ్(38)లు శుభారంభమిచ్చారు. టీ విరామానికి ముందు.. మర్క్రమ్ను బౌల్డ్ చేసిన బుమ్రా82 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ కాసేపటికే చైనామన్ బౌలర్ కుల్దీప్ ఓవర్లో డేంజరస్ రికెల్టన్ వికెట్ కీపర్ పంత్‌కు దొరికాడు.
ఓపెనర్లు వెంటవెంటనే ఔటైనా సఫారీ బ్యాటర్లు తడబడలేదు. కోల్‌కతా హీరో కెప్టెన్ తెంబ బవుమా(41), ట్రిస్టన్ స్టబ్స్(49)తో కలిసి ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. జడేజా, కుల్దీప్.. పేసర్లను సమర్ధంగా ఆడిన వీరిద్దరూ స్కోర్ 160 దాటించారు. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని జడేజా(1-30) విడదీసి ఊరటనిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన స్టబ్స్ (3-48) కుల్దీప్ ఓవర్లో స్లిప్‌లో కేఎల్ రాహుల్ చక్కని క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కీలక వికెట్లు పడినా సఫారీ టెయిలెండర్లు టోనీ జోర్జి(28), సెరులిన్ ముత్తుస్వామి (109) క్రీజులో పాతుకుపోయారు. అయితే.. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా సిరాజ్ ఓవర్లో జోర్జి వెనుదిరిగాడు. దాంతో.. తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా.
The last visiting batter before Senuran Muthusamy to score a Test hundred from No. 7 or lower in India: Quinton de Kock in 2019 🤝 #INDvSA pic.twitter.com/8ogPlKwhc7
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2025
తొలి రోజు మాదిరిగానే రెండో రోజు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. తొలి సెషన్లో వెర్రినే(45), ముతుస్వామి వికెట్ ఇవ్వలేదు. టీ తర్వాత జడేజా బౌలింగ్‌లో వెర్రినే వెనుదిరిగాడు. అనంతరం మార్కో జాన్సెన్(93) జతగా ముతుస్వామి జట్టు స్కోర్ 430 దాటించాడు. ఈ క్రమంలోనే అతడు కెరీర్లో తొలి శతకం సాధించాడు. వంద కొట్టిన అతడిని సిరాజ్ ఔట్ చేశాక.. సిక్సర్లతో విరుచుకుపడిన జాన్సెన్ సైతం సెంచరీకి చేరువయ్యాడు. కానీ.. కుల్దీప్ ఓవర్లో అతడు 93 పరుగలు వద్ద బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. అతడి వికెట్‌తో 489 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు వెనకబడి ఉంది.