Mustafizur Rahman | న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) స్టార్ పేసర్ ము స్తాఫిజుర్ రెహమాన్ స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం వీసా దరఖాస్తు కోసం ముస్తాఫిజుర్ పయనమైనట్లు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు.
దీంతో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ఈ స్టార్ పేసర్ అందుబాటులో ఉండటం లేదు. లీగ్‌లో మూడు మ్యాచ్‌లాడిన ముస్తాఫిజుర్ 7 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.