Mushir Khan | ముంబై: టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, అండర్-19 ప్రపంచకప్ హీరో ముషీర్ ఖాన్.. రంజీట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు. బరోడాతో జరుగుతున్న రంజీ క్వార్టర్ ఫైనల్లో ముషీర్ (357 బంతుల్లో 203 నాటౌట్; 18 ఫోర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 384 పరుగులు చేసింది.
కెప్టెన్ రహానే (3), పృథ్వీ షా (33) విఫలమైన చోట ముషీర్ డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వి కెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బరోడా.. 2 వికెట్లకు 127 పరుగులు చేసింది.