Mumbai Indians : క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో సీజన్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. దాంతో, ఫ్రాంఛైజీలు జట్ల లోగోను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఐదు సార్లు ఐపీఎల్ విజేత అయిన Mumbai Indians ముంబై ఇండియన్స్ తమ new jersey జెర్సీని విడుదల చేసింది. ముంబై యాజమాన్యం కొత్త జెర్సీ ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది. ‘అచ్చంగా ముంబై నగరాన్నితలపించేలా ఉంది’ అని జెర్నీని వర్ణిస్తూ క్యాప్షన్ రాసింది.
ముంబై టీమ్ న్యూ జెర్సీ లుక్ చాలా కొత్తగా ఉంది. ముంబై మహానగరంలో ఉన్న చారిత్రక కట్టడాలు, అక్కడి ప్రజా రవాణా వ్యవస్థలో భాగమేన టాక్సీల బొమ్మలను జెర్సీపై ముద్రించారు. గేట్‌వే ఆఫ్ ఇండియా కట్టడం, అక్కడి రోడ్లపై తిరిగే నలుపు, పసుపు రంగు షేర్ ఆటోలతో పాటు అరేబియన్ సముద్రం, సముద్ర రవాణాను పోలిన బొమ్మలు కొత్త జెర్సీపై ఆకట్టుకుంటున్నాయి. గత సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఈ సారి కప్పు కొట్టాలనే కసితో ఉంది.
గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ నిన్ననే తమ టీమ్ కొత్త జెర్సీని విడుదల చేసింది. లోగోపై నక్షత్రం గుర్తు ఉన్న ఈ జట్టు జెర్సీ కొత్తగా ఉంది. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. గత సీజన్లో ఐపీఎల్‌ల్లో ఆరంగేట్రం చేసిన గుజరాత్ కప్పు ఎగరేసుకుపోయింది. మరి, ఈసారి ఆ జట్టు ఎలా ఆడుతుంది? ఛాంపియన్‌గా నిలిచేది ఎవరు? అనేది ఆసక్తికరంగా ఉండనుంది.
Aaplya jersey madhe आमची मुंबई chi jhalak! 🌃💙
It’s all in the details 🤌✨
👕 Get your MI Jersey exclusively from MI Shop 👉 https://t.co/fxEh1tLtmf #OneFamily #MumbaiIndians pic.twitter.com/RdcNX0P2E1
— Mumbai Indians (@mipaltan) March 10, 2023