Ravichandran Ashwin | సొంత గడ్డపై ఒకే ఒక్కడు.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్
భారత సీనియర్ స్పిన్నర్ Ravichandran Ashwin రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగిస్తున్న అతను లెజెండరీ లెగ్ స్పిన్నర్ Anil Kumble అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టాడు. అవును.. స్వదేశంలో అత్యధికంగా 26సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
Ravichandran Ashwin : భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగిస్తున్న అతను లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టాడు. అవును.. స్వదేశంలో అత్యధికంగా 26సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఆఖరి టెస్టులో అశ్విన్ ఐదు వికెట్లు తీశాడు. అతను సొంతగడ్డపై ఈ ఫీట్ సాధించడం ఇది 26వ సారి. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (25 సార్లు)ను వెనక్కి నెట్టాడు. అంతేకాదు కుంబ్లే 122 టెస్టుల్లో ఈ ఫీట్ సాధిస్తే, 92 టెస్టుల్లోనే అశ్విన్ ఆ రికార్డు బ్రేక్ చేయడం విశేషం.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్, లియాన్ ఖాతాలో 113 వికెట్లు ఉన్నాయి. మూడు టెస్టుల్లో చెలరేగిన అశ్విన్ నాలుగో టెస్టులోనూ సత్తా చాటాడు. కీలక సమయంలో వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఐదో వికెట్‌కు 208 రన్స్ చేసిన ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ జోడిని అతను విడదీశాడు. ఒకే ఓవర్లో గ్రీన్, అలెక్స్ క్యారీలను ఔట్ చేశాడు. మర్ఫీని ఔట్ చేసి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్‌కు ఆరు వికెట్లు కూల్చడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇవి కూడా చదవండి
IND vs AUS | ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్.. అశ్విన్‌కు ఆరు వికెట్లు
Simon Doull: హసన్ అలీ భార్యపై సైమన్ డౌల్ కామెంట్రీ.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

