IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ Border Gavaskar trophy నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 480 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఉస్మాన్ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐదో వికెట్‌కు 208 పరుగులు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. అతను ఒకే ఓవర్లో గ్రీన్, అలెక్స్ క్యారీని పెవిలియన్ పంపి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత నాథన్ లియాన్ (34), టాడ్ మర్ఫీ(41) భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. వీళ్లు తొమ్మిదో వికెట్‌కు 70 రన్స్ కొట్టారు. అశ్విన్ వీళ్లిద్దరి పెవిలియన్ పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. షమీ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ తీశారు.
ఈమ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోర్ 104తో బ్యాటింగ్‌కు వచ్చిన అతను గ్రీన్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే 150 మార్క్ అందుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, పది గంటల అతని మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 422 బంతులు ఎదుర్కొన్న అతను 21 ఫోర్లు కొట్టాడు.