ముంబై: వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియాల్లో జరుగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ముంబై యువ బ్యాటర్ అయూశ్ మాత్రే సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ శనివారం ప్రపంచకప్‌తో పాటు అంతకుముందే దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లకు జట్లను ప్రకటించింది.
అయితే అండర్-19 వరల్డ్‌కప్‌నకు అయూశ్ సారథిగా ఉన్నా గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోని అతడి స్థానంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అయూశ్తో పాటు వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న విహాన్ మల్హోత్ర సైతం బీసీసీఐ సీవోఈకి వెళ్లనున్నాడు.