PL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మాజీ ఛాంపియన్ల పోరు అలరించనుంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.
కీలకమైన ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కే ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టేసి.. యువకెరటం ఆయుశ్ మాత్రేను తుది జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్లో ఇరుజట్లు 38సార్లు ఎదురుపడ్డాయి. ముంబై 20 విజయాలతో ఆధిక్యంలో ఉండగా.. చెన్నై 18 సార్లు గెలిచింది.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ : రోహిత్ శర్మ, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్
🚨 Toss 🚨@mipaltan won the toss and elected to bowl against @ChennaiIPL in Mumbai.
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#TATAIPL | #MIvCSK pic.twitter.com/o62WJevedv
— IndianPremierLeague (@IPL) April 20, 2025
చెన్నై తుది జట్టు : షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుశ్ మాత్రే, జడేజా, శివం దూబే, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మథీశ పథిరన.
ఇంప్యాక్ట్ సబ్స్ : అన్షుల్ కంబోజ్, కమలేశ్ నగర్కొటి, రామకృష్ణ ఘోష్, సామ్ కరన్, అశ్విన్.