ఢిల్లీ: తొలి ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (ఐపీబీఎల్) టైటిల్‌ను ముంబై స్మాషర్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ముంబై.. 5-1తో హైదరాబాద్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించి ఈ టోర్నీ తొలి సీజన్ టైటిల్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
శనివారం జరిగిన క్వాలిఫయర్-1లో చెన్నైని ఓడించి ఫైనల్ చేరిన హైదరాబాద్..అదే జోరును కొనసాగించలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.