DCW vs MIW : డబ్ల్యూపీఎల్‌లో మూడో విజయం కోసం నిరీక్షిస్తున్న ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే షాకిచ్చారు ఢిల్లీ పేసర్లు. 21 పరుగులకే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ పంపారు. ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(2 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్(0)లు మరో వికెట్ పడకుండా భాగస్వామ్యం నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఆరు ఓవర్లకు ముంబై స్కోర్..23-2.
టాస్ ఓడిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా వచ్చిన సంజీవన సంజన(9) పెద్ద షాట్ ఆడబోయి నందిని శర్మ ఓవర్లో బౌల్డ్ అయింది. తొలి వికెట్ అందించిన తను సెల్యూట్ సెలబ్రేషన్ చేసుకుంది. ఆ తర్వాతి ఓవర్లోనే హీలీ మాథ్యూస్(12) వెనుదిరిగింది. మరినేకాప్ సంధించిన బంతి లెంగ్త్‌ను అంచనా వేయలేక బౌల్డ్ అయ్యింది.
Sweet sound of timber for @DelhiCapitals \|/
🎥 Clean bowled…and again, ft. Nandni Sharma and Marizanne Kapp 🔥
Updates ▶️ https://t.co/GUiylorLwE #TATAWPL | #KhelEmotionKa | #DCvMI pic.twitter.com/z2YCGaR5wR
— Women’s Premier League (WPL) (@wplt20) January 20, 2026