Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ ను ఇటీవలే అతడి ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రోల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో రోహిత్.. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా హార్ధిక్ పాండ్యా సారథ్యంలో ఆడక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ మళ్లీ భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో టీ20 ఆడలేదు. సెలక్టర్లు కూడా రోహిత్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పారు. అతడే ఫ్యూచర్ కెప్టెన్ అని కూడి ఇదివరకే హింట్ కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మరి వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ ఆడతాడా..? ఆడితే కెప్టెన్‌గానే కొనసాగుతాడా..? లేక సాధారణ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోయినంత మాత్రానా భారత సారథికి వచ్చిన నష్టమేమీ లేదని, వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అతడి సారథ్యంలోనే బరిలోకి దిగుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ముంబై కెప్టెన్సీ మార్పు అతడి జాతీయ జట్టు కెప్టెన్సీ మీద ఎటువంటి ప్రభావం చూపదని, టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు అతడి సారథ్యంలోనే ఆడుతుందని బోర్గు వర్గాలు తెలిపాయి.
A Rohit Sharma fan made a beautiful edit for their leader at Wankhede stadium.
– Hitman, the brand. pic.twitter.com/iQaHVgaiIM
— Johns. (@CricCrazyJohns) December 18, 2023
టీ20 వరల్డ్ కప్ – 2024లో టీమిండియాకు హార్ధిక్ పాండ్యా సారథిగా ఉంటాడా..? అన్న విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ప్రముఖ హిందీ డైలీ దైనిక్ జాగరణ్తో స్పందిస్తూ.. ‘లేదు’ అని సమాధానం చెప్పడం గమనార్హం. రోహితే తమ ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అని చెప్పిన ఆయన.. ప్రస్తుతానికి టీమిండియాకు అన్ని ఫార్మాట్లకూ హిట్‌మ్యానే కెప్టెన్ అని, ఏ ఒక్క ఫార్మాట్ నుంచి కూడా అతడిని బీసీసీఐ తప్పించలేదని, అతడు కూడా వైదొలగలేదని స్పష్టం చేశాడు. ఇది రోహిత్ ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించేదే అయినా పొట్టి ప్రపంచకప్‌కు మరో ఆరు నెలల సమయం ఉండటంతో అప్పటివరకు పరిణామాలు ఎలా మారుతాయో, అసలు రోహిత్ మరో వరల్డ్ కప్ ఆడతాడో లేదోననేది కాలమే నిర్ణయించాలి.