Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో ఐదు టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) 17వ సీజన్లో మాత్రం బోణీ కొట్టలేదు. వరుసగా మూడు ఓటములతో నిరాశపరిచింది. అయితే.. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఫన్నీ డ్రెస్‌కోడ్‌లో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
జట్టు నియమాలను బ్రేక్ చేసినందుకు ఇషాన్‌కు శిక్ష పడింది. అందులో భాగంగా అతడు ముంబై ఇండియన్స్ లోగో ఉన్న ఫన్నీ సూపర్ హీరో డ్రెస్‌తో ఎయిర్‌పోర్టుకు బయల్దేరాడు. తన వెరైటీ గెటప్‌తో ఇషాన్ అక్కడి ప్రయాణికులు, సిబ్బందిని నవ్వించాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబై జట్టు కోచ్, సహాయక సిబ్బంది ఆటగాళ్ల పట్ల కఠినంగానే ఉంటుంది. టీమ్ ప్రొటోకాల్స్ పాటించకపోయినా, హోటల్ కాల్స్‌కు స్పందించకున్నా, వాళ్ల ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చిన ఎంతటి ఆటగాడిగైనా శిక్ష తప్పనిసరి. వాళ్లు రోజంతా ఒకటే డ్రెస్‌లో ఉండాల్సి వస్తుంది.
ప్రతి సీజన్‌ను ఓటమితో ప్రారంభించినట్టే 17వ సీజన్‌ను ముంబై ఓటమితోనే మొదలెట్టింది. అయితే.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దాంతో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో వివర్శలు వస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకే సారథ్య పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే.. ఫ్రాంచైజీ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.