Shabnim Ismail: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్
Shabnim Ismail: ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్ .. మహిళ క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ బౌలర్.. అత్యంత వేగవంతమైన బంతిని వేసి రికార్డును నెలకొల్పింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇస్మాయిల్ గంటకు 132.1 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసింది.
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ షబ్నమ్ ఇస్మాయిల్(Shabnim Ismail) .. మహిళ క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ బౌలర్.. అత్యంత వేగవంతమైన బంతిని వేసి రికార్డును నెలకొల్పింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్మాయిల్ ఆ ఘనత సాధించింది. ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యంత స్పీడ్ బంతి గంటకు 130 కిలోమీటర్లు మాత్రమే. కానీ మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇస్మాయిల్ 132.1 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసింది.
మహిళల క్రికెట్లో గంటకు 130 కిలోమీటర్ల వేగం దాటడం ఇదే మొదటి సారి. ఆ బంతి మాజీ ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ ప్యాడ్స్‌ను గట్టిగా ఢీకొట్టింది. సౌతాఫ్రికాతో తరపున ఇస్మాయిల్ 8 వరల్డ్‌కప్‌లు ఆడింది. ఇటీవలే ఆమె అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నది. ఓసారి విండీస్‌తో మ్యాచ్‌లో 128 కిలోమీటర్ల వేగంతో, ఆ తర్వాత 2022 వరల్డ్‌కప్‌లో 127 కిలోమీటర్ల వేగంతో ఓసారి బౌలింగ్ చేసింది.
34 ఏళ్ల ఇస్మాయిల్ 127 వన్డేలు, 113 టీ20లు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల పాటు ఆమె తన ట్యాలెంట్‌ను ప్రదర్శించింది. మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా కీర్తిగాంచిన ఇస్మాయిల్.. అంతర్జాతీయ క్రికెట్లో 317 వికెట్లు తీసుకున్నది. టెస్టుల్లో 3, వన్డేల్లో 191, టీ20ల్లో 123 వికెట్లు తీసుకున్నది.
A historic day as Shabnim Ismail delivers the fastest delivery ever recorded in women’s cricket 🤯
Details 👇https://t.co/l6AWuDcSyt
— ICC (@ICC) March 6, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

