వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. గుజరాత్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టిన ముంబై.. గుజరాత్ నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఊదేసింది.
సీవర్ బ్రంట్ (39 బంతుల్లో 57, 11 ఫోర్లు) దూకుడుగా ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. మరోసారి టాపార్డర్ వైఫల్యంతో 120 పరుగులకే కుప్పకూలింది. హర్లీన్ డియోల్ (32) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో హీలి మాథ్యూస్ (3/16), అమెలియా (2/22) జెయింట్స్‌ను కట్టడిచేశారు.