షార్జా: ఐఎల్ టీ20 టోర్నీలో ముంబై ఎమిరేట్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన లోస్కోరింగ్ గేమ్‌లో నైట్‌రైడర్స్‌పై ముంబైదే పైచేయి అయ్యింది.
తొలుత గజన్ఫర్(3/24), మహమ్మద్ రోహి ద్(2/19) ధాటికి అబుదాబి నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 120/8 స్కోరుకు పరిమితమైంది. అలీషాన్ షరఫ్(50) ఒక్కడే ఆకట్టుకోగా, మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ముంబై..36 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయినా..టామ్ బాటన్(64 నాటౌ ట్), షకీబల్‌హసన్(38) రాణించడంతో జట్టు విజయాన్నందుకుంది.