IND A vs ENG Lions : ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత పేసర్ ముకేశ్ కుమార్ (3-56) చెలరేగుతున్నాడు. ఆతిథ్య ఇంగ్లండ్ లయన్స్ (England Lions)కు షాకిస్తూ స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు తీశాడీ స్పీడ్‌స్టర్. దాంతో, ఒకదశలో పటిష్ఠ స్థితిలో ఉన్న ప్రత్యర్థి కాస్త.. పట్టు కోల్పోయింది. మాక్స్ హోల్డెన్(101) సెంచరీ బాదినప్పటికీ ముకేశ్ విజృంభణత భారత ఏ జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది ఇంగ్లండ్ లయన్స్. అయితే.. ఇంకా 224 పరుగులు వెనకబడే ఉంది.
ఓవైపు సహచరులు విఫలం అవుతున్నా.. ఓపెనర్ టామ్ హైన్స్(142 నాటౌట్) మాత్రం జిడ్డలా క్రీజులో పాతుకుపోయాడు. భారత బౌలర్లను విసిగిస్తున్న ఈ యంగ్‌స్టర్ జట్టును ఒడ్డున పడేయాలని లక్ష్యంతో ఉన్నాడు. 131 వద్ద రెండో వికెట్ పడిన తర్వాత మ్యాక్స్ హోల్డెన్(101)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు హైన్స్. శతకాలతో చెలరేగిన ఈ ఇద్దరూ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
Mukesh Kumar gets the 3rd Wicket for India A, Max Holden dismissed for 101(101).
ENG Lions 312/3 (67.1), trail by 245 runs.
📷 JioHotstar pic.twitter.com/PmRJOGYC9S
— CricketGully (@thecricketgully) June 1, 2025
అయితే.. ముకేశ్ ఈ జోడీని విడదీసి ఇంగ్లండ్ లయన్స్‌కు షాకిచ్చాడు. మరో 12 పరుగుల వ్యవధిలోనే జేమ్స్ రెవ్(8)ను ఎల్బీగా దొరకబుచ్చుకున్న అతడు.. రెహ్మాన్ అహ్మద్‌ను సైతం వెనక్కి పంపాడు. దాంతో, 312తో ఉన్న ఇంగ్లండ్ లయన్స్ లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు వెళ్లిన కరుణ్ నాయర్ (204) ద్విశతకం, సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94)లు వీరకొట్టుడు కొట్టారు. టెయిలెండర్స్ సైతం దంచేయడంతో టీమిండియా 557 పరుగులతో ప్రత్యర్థిని డస్సిపోయేలా చేసింది.