MS Dhoni | టెన్నిస్‌లో డబుల్స్ ట్రోఫీ గెలిచిన ఎం.ఎస్.ధోనీ.. వైరల్ అవుతున్న ఫొటోలు
ఎంఎస్డీ హాబీలు.. బైక్‌లు కలెక్ట్ చేయడం, ట్రోఫీలు గెలవడం అంటున్న నెటిజన్లు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ కొత్త అవతారమెత్తాడు. క్రికెటర్‌గా తన హెలికాప్టర్ షాట్‌తో అభిమానులను అలరించిన ధోనీ తాజాగా టెన్నిస్ కోర్టులోకి దిగాడు. ఆట ఏదైనా విజయం తనదే అన్నట్టు..ఫైనల్లో విజయం సాధించి, ట్రోఫీ అందుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ ఛాంపియన్షిప్ 2022లో ధోనీ, సుమిత్ కుమార్ బజాజ్ జోడీ డబుల్స్ విజేతగా నిలిచింది.
గురువారం జరిగిన ఫైనల్ ధోనీ జోడీ, ప్రత్యర్థి జోడీ కంటే నాలుగు పాయింట్లు ఆధిక్యంలో ఉంది. అప్పటికే వెలుతురు తగ్గిపోవడంతో ఆటను నిలిపి వేసిన నిర్వాహకులు ధోనీ జోడీని విజేతగా ప్రకటించారు.
ధోనీ డబుల్స్ ట్రోఫీ అందుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఎంఎస్డీ హాబీలు.. బైక్‌లు కలెక్ట్ చేయడం, ట్రోఫీలు గెలవడం’ అని ఒక యూజర్ స్పందించాడు. ‘ఏ ఆటలో అయినా విజేత నువ్వే’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ధోనీ కెప్టెన్సీలో భారజట్టు 2007లో టీ 20 వరల్డ్‌కప్ సాధించడమే కాకుండా 2011లో వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ నాయకత్వంలో ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. ఈమధ్యే ధోనీ ‘అథర్వ’ అనే మైథలాజికల్ సైన్స్‌ఫిక్షన్ యానిమేషన్ సిరీస్‌లో నటించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

