MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni ) 43వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తన ఇంట్లో మహీబాయ్తో కేకు కట్ చేయించాడు. ధోనీ పుట్టిన రోజు వేడుకల్లో అతడి భార్య సాక్షి సింగ్ (Sakshi Singh) సైతం పాల్గొంది. కేక్ కట్ చేసి ధోనీకి తినిపించింది.
ఆతర్వాత సాక్షి చేతులు జోడించి ధోనీకి నమస్కరించి.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. ధోనీ బర్త్ డే వీడియోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మహీ భాయ్ ఇది ఎగ్‌లెస్ కేకు కదా! అని అడుగుతాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
టీమిండియా గొప్ప కెప్టెన్‌గా కితాబులందుకున్న ధోనీ కెరీర్లో పలు రికార్డులు నెలకొల్పాడు. మరే సారథికి సాథ్యంకాని రీతిలో దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. మహీ సారథ్యంలో టీమిండియా 2007లో పొట్టి ప్రపంచకప్ నెగ్గింది. ఆ తర్వాత స్వదేశంలో 2011 వన్డే వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ధోనీ కెప్టెన్సీలో భారత్ 2013లో ఇంగ్లండ్‌ను ఓడించి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2019 వరల్డ్ కప్ భారత అభిమానులకు షాక్‌కు గురి చేసింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రనౌట్ కావడంతో మహీ తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ భాయ్.. ఐపీఎల్లో సైతం కెప్టెన్‌గా తన ముద్ర వేశాడు.
16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో ట్రోపీ కట్టబెట్టి సారథిగా తన సత్తా తగ్గలేదని మరోసారి చాటుకున్నాడు. 41 ఏండ్ల వయసులోనూ చెక్కుచెదరని ఫిట్నెస్తో కనిపిస్తున్న మహీ 17వ సీజన్‌తో ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, అతడు మరో సీజన్న ఆడుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.