రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్నా చాలా ఇష్టం. ఈ విషయం ఆయన గ్యారేజీని చూస్తేనే అర్థమవుతుంది. రాంచీలోని తన ఫాంహౌస్‌లో ఉన్న గ్యారేజీని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ధోనీ గ్యారేజీలో విభిన్న రకాల మోడల్‌ల బైకులతో పాటు వింటేజ్ కార్లూ ఉన్నాయి.
ధోనీ దగ్గరున్న అనేక రకాల విలాసవంతమైన కార్లలో ప్రఖ్యాత రోల్స్ రాయిస్ కారు చాలా ప్రత్యేకమైనది. తాజాగా 1973 నాటి ప్రఖ్యాత పోంటియాక్ ట్రాన్స్ యామ్ కారులో ధోనీ చక్కెర్లు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. రాంచీ వీధుల్లో ఎరుపు రంగు పోంటియాక్ ట్రాన్స్ యామ్ SD – 455 మోడల్ కారులో ధోనీ రయ్‌మంటూ దూసుకుపోతున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటున్నది.
MS Dhoni driving 1973 Pontiac Trans Am SD-455 in Ranchi. pic.twitter.com/LQANMJXWwg
— Johns. (@CricCrazyJohns) July 31, 2023
మహేంద్ర సింగ్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి అరుదైన పాతకాలపు కార్లను సేకరిస్తూ తన క్లాసిక్ కార్ గ్యారేజీని పరిధిని పెంచుతున్నారు. వారం రోజుల క్రితం కూడా మిస్టర్ కూల్ రాయల్ బ్లూ వింటేజ్ కారులో రాంచీ రోడ్లపై చక్కెర్లు కొట్టాడు.