రాంచీ: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ.. రానున్న ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఐపీఎల్ కోసం ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టడమే దీనికి కారణం.
రాంచీ స్టేడియంలో ధోనీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను జేఎస్సీఏ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ‘లుక్ వూ ఈజ్ బ్యాక్. ప్రైడ్ ఆఫ్ జేఎస్సీఏ ధోనీ’ అంటూ విడుదల చేసింది.