చెన్నై: మిస్టర్ కూల్ ధోనీ( MS Dhoni) రోజు రోజుకూ ఫిట్ అవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అయిదేళ్లు అయినా.. ఐపీఎల్లో మాత్రం తన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ యేటి ఐపీఎల్‌కు కూడా ఫుల్ ప్రిపేరవుతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్. ప్రాక్టీస్ సెషన్లోనూ తన ఫెవరేట్ షాట్స్‌తో చెలరేగిపోతున్నాడు. తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో.. ధోనీ తన హెలికాప్టర్ షాట్‌తో కేక పుట్టించాడు. ఆ జట్టు స్పీడ్ బౌలర్ మతీష పతిరన వేసిన యార్కర్‌ను.. చాలా ఈజీగా హెలికాప్టర్ షాట్ ఆడేశాడు ధోనీ. ఇక నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న అశ్విన్ ఆ షాట్‌ను చూసి నవ్వేసుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.
18వ ఎడిషన్ ఐపీఎల్ కోసం ధోనీ ప్రతి రోజు రెండు నుంచి మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. టీ20 టోర్నీ కోసం ధోనీ చాలా సూపర్ ఫిట్‌గా తయారైనట్లు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో ధోనీని కలిశానని, అతను చాలా ఫిట్‌గా కనిపించాడని, ఇంత వయసులో ఎలా ఫిట్ అయ్యావని అడిగినట్లు భజ్జీ గుర్తు చేశాడు. ఫిట్‌గా ఉండడం నిజంగా కష్టమే అయినా.. ఇలా చేయడం ఎంజాయ్ చేస్తున్నానని ధోనీ చెప్పినట్లు టర్బనేటర్ తెలిపాడు. ధోనీ తన ఫిట్నెస్తో టోర్నీకి రెఢీ అయ్యాడని, బౌలర్లు అందర్నీ డామినేట్ చేస్తున్నాడని హర్భజన్ చెప్పాడు.
దాదాపు రెండు నెలల నుంచి ప్రాక్టీసు చేస్తున్నాడని, ఎన్ని బాల్స్ ఆడితే, అంత టైటింగ్ కుదురుతుందని, ఫ్లో వస్తుందని, ఇక సిక్సర్లు కురుస్తాయని భజ్జీ తెలిపాడు. అందరి కంటే ముందుగా గ్రౌండ్‌కు వచ్చి, అందరి కన్నా చివర గ్రౌండ్‌ను విడుతాడని చెప్పాడు. మార్చి 23వ తేదీన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై ఆడనున్నది.
— Telugu Dhoni fans official 🤫 (@dhonsim140024) March 18, 2025