MS Dhoni | దుబాయ్‌లో పంత్, ఫ్రెండ్స్‌తో ధోనీ క్రిస్మస్ పార్టీ.. ఫోటోలు షేర్ చేసిన సాక్షి
దుబాయ్‌లోని సుశిసాంబా రెస్టారెంట్లో క్రిస్మస్ పార్టీ
MS Dhoni : ఐపీఎల్ 2023కు ముందు దొరికిన విరామాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ ఫ్యామిలీతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ధోనీ అక్కడే క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాడు. అతనితో పాటు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. దుబాయ్‌లోని సుశిసాంబా రెస్టారెంట్లో జరిగిన క్రిస్మస్ పార్టీలో ధోనీ, పంత్ సందడి చేశారు. వీళ్ల పార్టీ ఫొటోలను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత పంత్ దుబాయ్ టూర్‌కు వెళ్లాడు. రెండు టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 93 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2023 మినీ వేలం మూడు రోజుల క్రితమే ముగిసింది. త్వరలోనే సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పంత్ బరిలోకి దిగనున్నారు. గత సీజన్లో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ అంతగా రాణించలేదు. దాంతో ఈసారి రెండు ఫ్రాంఛైజీలు ట్రోఫీమీద కన్నేశాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

