Dhoni: ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు చూశారా?.. వీడియో
MS Dhoni : హార్దిక్ పాండ్యా వేసిన ఫైనల్ ఓవర్లో.. ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో 4 బంతుల్లోనే 500 స్ట్రయిక్ రేట్‌తో ధోనీ 20 రన్స్ చేశాడు.
వాంఖడే: ధోనీ(Dhoni) దంచేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో.. మిస్టర్ కూల్ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. అది కూడా ఫైనల్ ఓవర్లో ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. డారెల్ మిచెల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. 4 బాల్స్ ఆడాడు. అందులో మొదటి మూడు బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో ధోనీ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. 4 బాల్స్‌లో ధోనీ మొత్తం 20 రన్స్ స్కోర్ చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 500. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తన స్వంత గ్రౌండ్లో ఓటమి చవిచూసింది. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ధోనీ మ్యాచ్ బాల్‌ను ఓ అభిమానికి అందజేశాడు.
DO NOT MISS
MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk
Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG
— IndianPremierLeague (@IPL) April 14, 2024
ఐపీఎల్ కెరీర్లో 20వ ఓవర్లో ధోనీ బ్యాటింగ్ రికార్డు అసాధారణ స్థాయిలో ఉన్నది. ఇప్పటి వరకు అతను ఐపీఎల్లో 20వ ఓవర్లో 309 బాల్స్ ఆడాడు. దాంట్లో అతను 756 రన్స్ కొట్టాడు. స్ట్రయిక్ రేట్ 244.66గా ఉంది. ధోనీ ఫైనల్ ఓవర్ ఇన్నింగ్స్‌ల్లో 51 ఫోర్లు, 64 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో ధోనీ ఫైనల్ ఓవర్లో 12 బాల్స్ ఎదుర్కొన్నాడు. దాంట్లో 41 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 341.66గా ఉంది. ఈ సీజన్ ఫైనల్ ఓవర్లో రెండు బౌండరీలు, అయిదు సిక్సర్లు బాదాడతను.
ఈ సీజన్లో ధోనీ ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేశాడు. దాంట్లో 59 రన్స్ స్కోర్ చేశాడు. అన్ని ఇన్నింగ్స్‌ల్లో ఔట్ కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 16 బంతుల్లో 37 రన్స్ స్కోర్ చేశాడు. ధోనీ ఐపీఎల్ కెరీర్లో 256 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో అతను 5141 రన్స్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్ సగటు 39.24గా ఉన్నది. స్ట్రయిక్ రేట్ 136.58. ఇప్పటి వరకు ఐపీఎల్లో 24 ఫిఫ్టీలు కొట్టాడతను. బెస్ట్ స్కోర్ 84.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

