MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి బైక్‌లంటే ఎంత ఇష్టమో పెంపుడు జంతువులన్నా అంతే ఇష్టం. జార్ఖండ్‌లోని రాంచీలోని తన ఫాం హౌస్‌లో మహీ భాయ్ పలు జంతువులను పెంచుకుంటున్నాడు. ఖాళీ సమయం దొరికితే వాటికి స్వయంగా ఆహారం తినిపిస్తూ.. ముద్దు చేస్తుంటాడు కూడా. తాజాగా ధోనీ.. చేతక్(Chetak), పోనీ(Pony) అనే పెంపుడు గుర్రాలకు మేత తినిపిస్తున్న వీడియో బయటకొచ్చింది.
అందులో ఆ గుర్రాలు ధోనీ చేతుల్ని నాకుతుంటే అతడు వాటి తలను ప్రేమగా నిమురుతున్నాడు. ఆ తర్వాత స్నేహితులతో పాటు మహీ కూడా వాటికి గుగ్గిళ్లు తినిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Mahi and his Lovable Pets !! 🐎🥰#MSDhoni | #WhistlePodu | #Dhoni
📹 via Chandra Shekhar pic.twitter.com/NQs3xLNRfO— TEAM MS DHONI #Dhoni (@imDhoni_fc) December 3, 2023
తొలిరోజుల్లో జులపాల జుట్టుతో టీమిండియాకు ఆడిన ధోనీ.. అనతికాలంలోనే సారథిగా పగ్గాలు చేపట్టాడు. మహీ భాయ్ సారథ్యంలో భారత్ ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీ(2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ)లు గెలిచింది. అయితే.. 2019 వరల్డ్ కప్ ధోనీ కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని మహీ అనుకున్నాడట.
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ

అయితే.. 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. యువకులతో నిండిన జట్టును ఫైనల్‌కు చేర్చిన మహీ.. టైటిల్ పోరులో తన వ్యూహాలతో గుజరాత్ టైటన్స్‌కు చెక్ పెట్టాడు.