North Korea: ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనండి.. ఉత్తర కొరియా నేత కిమ్ పిలుపు
North Korea: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉత్తర కొరియా తల్లులకు దేశాధినేత కిమ్ పిలుపునిచ్చారు. పడిపోతున్న జనన రేటును ఆపాలన్నారు. బర్త్ రేట్ పడిపోకుండా చూడాలని, పిల్లల్ని సరైన రీతిలో పెంచాలన్నారు.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea)లో జనన రేటు పడిపోతున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. శిశు జనన రేటు తరుగుదలను అడ్డుకోవాలన్నారు. ఇది ప్రతి ఇంటి సమస్య అని కిమ్ అన్నారు. ప్యోంగ్యాంగ్లో మహిళలతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బర్త్ రేటు పడిపోవడాన్ని నిలువరించాలని, అలాగే పిల్లలను సరైన రీతిలో పెంచాలని, ఇవన్నీ తల్లుల బాధ్యతలను అని కిమ్ అన్నారు. యూఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం 2023లో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు 1.8గా ఉంది. అయితే ఇటీవల దక్షిణ కొరియా జనన రేటు కూడా దారుణంగా పడిపోయింది. ఆ దేశంలో జనన రేటు 0.78గా ఉంది. ఇక జపాన్‌లో ఫెర్టిలిటీ రేటు 1.26గా ఉంది. ఉత్తర కొరియాలో 2.5 కోట్ల జనాభా ఉంది. ఇటీవల ఆ దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. 1990 తరహాలో ఆ దేశం ఆకలితో అల్లాడిపోయింది. ఎక్కువ పిల్లలు కనాలని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

