న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడడంతో ఆటగాళ్లు క్రమంగా తమ ఇండ్లకు చేరుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్, టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ముంబైలో అడుగుపెట్టగా.. ఆర్సీబీ ఆటగాళ్లందరూ బయలుదేరారు. కాగా కరోనా సహాయక చర్యలు చేపట్టేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు. ఇందుకోసం యువసేన ప్రతినిధితో సమావేశమయ్యాడు. మరోవైపు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా తమ నివాసాలకు చేరారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరూ క్షేమంగా ఇళ్లకు చేరాకే.. తాను వెళతానని కెప్టెన్ ధోనీ చెప్పాడని సమాచారం. కరోనా బారనపడిన హస్సీ కోలుకునేవరకు చెన్నైలోనే ఉండనున్నాడు.