MS Dhoni | ఎంఎస్ ధోనీ (MS Dhoni).. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన్ని అంతా ముద్దుగా తలా అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరో రికార్డు (Creates History) సాధించారు.
ఐపీఎల్లో భాగంగా సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ధోనీ కీలకంగా వ్యవహరించారు. కేవలం 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. 43 సంవత్సరాల 282 రోజుల వయసులో ఈ అవార్డు అందుకున్న క్రికెటర్‌గా ధోనీ నిలిచారు. అతి ఎక్కువ వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
2014లో ప్రవీణ్ తంబే 42 సంవత్సరాల 209 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు తంబే రికార్డును ధోనీ బ్రేక్ చేశారు. మరోవైపు, 2011లో షేన్ వార్న్ రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్నాడు. 41 సంవత్సరాల 223 రోజుల వయసులో, 41 సంవత్సరాల 211 రోజుల వయసులో వార్న్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 41 సంవత్సరాల 181 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుస ఓటములకు ఫుల్స్టాప్ పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్‌లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.
Also Read..
IPL 2025 | బ్యాట్లను పరిశీలిస్తున్న అంపైర్లు..! ఐపీఎల్లో రూల్‌ని బీసీసీఐ అందుకు అమలు చేస్తోంది..?
MS Dhoni: ధోనీ మ్యాజిక్ రనౌట్.. ఫ్యాన్స్ ఫుల్ థ్రిల్.. వీడియో
CSK | హమ్మయ్య చెన్నై గెలిచింది.. వరుస ఓటములకు ఫుల్స్టాప్!