లక్నో: మిస్టర్ కూల్ ధోనీ(MS Dhoni).. ఓ వెరైటీ రనౌట్ చేశాడు. లక్నో బ్యాటర్ అబ్దుల్ సమద్‌ను అరెస్టు చేసిన స్టయిల్ అదిరింది. మెరుపు వేగంతో స్టంప్స్ చేసే ధోనీ.. ఓ వైడ్ బంతిని అందుకుని.. నాన్‌స్ట్రయికర్ దిశగా ఆ బంతిని ధోనీ విసిరేసిన తీరు .. క్రికెటర్ ప్రేమికుల్ని స్టన్ చేస్తోంది. ఐపీఎల్లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 19వ ఓవర్ రెండో బంతికి ఓ అద్భుతం జరిగింది. పతిరన్ వేసిన బంతిని లెగ్‌సైడ్‌లో అందుకున్న ధోనీ.. పరుగు తీస్తున్న బ్యాటర్ అబ్దుల్ సమద్ దిశగా విసిరాడు. అండర్ ఆర్మ్ త్రో చేశాడు ధోనీ. పరుగు తీస్తున్న బ్యాటర్ మీదు నుంచి వెళ్లిన ఆ బంతి నేరుగా వికెట్లను తాకింది. దీంతో అబ్దుల్ సమద్ రనౌట్ అయ్యాడు. ఆ సెన్షేషనల్ రనౌట్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
MS DHONI WITH THE NO-LOOK MISSILE FROM BEHIND THE STUMPS!!
RUNS OUT SAMAD AT NON-STRIKER’S!!
Bro’s 42 but still moving like a ninja!!
THALA BLOOD STILL ICE COLD
😭🔥😭🔥 #MSDhoni #IPL2025 #LSGvsCSK #LSGvCSK pic.twitter.com/uCqrN2CVM3— Dhoni Craziness (@MSDcrazyAbHiNaV) April 14, 2025
ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుస ఓటములకు ఫుల్స్టాప్ పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ఎట్టకేలక చెన్నై సత్తాచాటింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్‌లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.