ACA | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ఆదివారం ఎన్నికల ఫలితాలను వెల్లడించారు.
ఏసీఏ లోని ఇతర పదవులకూ కేశినేని ప్యానల్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కేశినేని సీఎం సహాయనిధి కింద వరద బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.