HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వేంకటేశ్వర రెడ్డి ఆరోపించారు. సోమవారం పాలమూరు స్టేడియంలో టర్ఫ్ వికెట్ నిర్మాణ పనులకు హెచ్సీఏ భూమి పూజ చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ‘60 ఏండ్లుగా హెచ్సీఏ ఏనా డూ తెలంగాణ జిల్లాలలో క్రికెట్ అభివృద్ధిని పట్టించుకోలేదు. క్రికెట్లో సత్తా, నైపుణ్యం కలిగిన గ్రామీణ క్రీడాకారులను విస్మరించింది. కానీ టీడీసీఏ ఏర్పడటంతోనే హెచ్సీఏలో చలనం వచ్చింది’ అని అన్నారు.