Monsoon Regatta | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న వైఏఐ మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో ఏకలవ్య బాతమ్ పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర అండర్-15 అప్టిమిస్టిక్ విభాగంలో ఏకలవ్య 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, శరణ్య యాదవ్, అజయ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.
మరోవైపు అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన ధరణి లావేటి, వడ్ల మల్లేశ్ 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అండర్-15 బాలికల అప్టిమిస్టిక్ విభాగంలో మన రాష్ర్టానికే చెందిన దీక్షిత కొమురవెల్లి 52 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.