కాన్పూర్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు(IND vs BAN)లో బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ సెంచరీ నమోదు చేశాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఇవాళ అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ తరపున అతనికి ఇది 13వ టెస్టు సెంచరీ. 172 బంతుల్లో అతను శతకాన్ని పూర్తి చేశాడు. హక్, హసన్ మీర్జాలు ఇద్దరూ కాసేపు భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. భోజన విరామం తర్వాత బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. లంచ్ బ్రేక్ తర్వాత 50 బంతుల్లో 28 రన్స్ చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. సెంచరీ బ్యాటర్ మోమినుల్ మాత్రం 107 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, అశ్విన్, ఆకాశ్‌లు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక చివరి వికెట్‌ను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో జడేజా 300వ వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. టెస్టు ఫార్మాట్లో అతివేగంగా 300 వికెట్లు తీసి మూడు వేల పరుగులు చేసిన రెండవ ప్లేయర్‌గా నిలిచాడు.
Innings Break!
Bangladesh all out for 233 runs.
Scorecard – https://t.co/JBVX2gyyPf… #TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/aiUfxPCLFh
— BCCI (@BCCI) September 30, 2024