కోల్‌కతా: డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆరంభం నుంచి దుమ్మురేపిన మోహన్ బగన్ జట్టు.. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ టైటిల్ పట్టేసింది. ఆదివారం జరిగిన తుదిపోరులో మోహన్ బగన్ 1-0తో ఈస్ట్ బెంగాల్‌పై విజయం సాధించింది. 2000లో చివరి సారి ఈ ట్రోఫీ గెలిచిన మోహన్ బగన్కు 23 ఏండ్ల తర్వాత ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన పోరులో మోహన్ బగన్ తరఫున దిమిత్ర పెట్రాటోస్ (71వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఓవరాల్‌గా మోహన్ బగన్ జట్టుకు ఇది 17వ డ్యూరండ్ కప్ టైటిల్.