లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యువ పేసర్ మోసిన్‌ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో మోసిన్ తన అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న హార్డ్హిట్టర్స్ టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్‌ను యార్కర్లతో కట్టడి చేస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మోసిన్ మాట్లాడుతూ ‘ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. గత పది రోజుల నుంచి ఐసీయూలో ఉన్న నాన్న మ్యాచ్‌కు ముందు రోజు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మ్యాచ్ ఆయన చూశారని అనుకుంటున్నాను. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులో రావడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. గత సీజన్లో ఈ యువ లక్నో బౌలర్ గాయపడ్డ సంగతి తెలిసిందే.