Mohammed Shami: మాకు డబ్బులివ్వాలంటే బాగా ఆడాలిగా..! వరల్డ్ కప్ లో ఇరగదీస్తున్న షమీపై స్పందించిన మాజీ భార్య
Mohammed Shami: న్యూజిలాండ్‌తో మ్యాచ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన షమీ.. నాలుగు మ్యాచ్‌లలోనే ఏకంగా 16 వికెట్లు పడగొట్టి భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లలో భారత్ అతడిని పక్కనబెట్టింది. కానీ న్యూజిలాండ్‌తో మ్యాచ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన షమీ.. నాలుగు మ్యాచ్‌లలోనే ఏకంగా 16 వికెట్లు పడగొట్టి భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ షమీకి బంతినివ్వడమే ఆలస్యం వికెట్ తీయడానికి అన్నట్టుగా సాగుతోంది అతడి విధ్వంసం. షమీ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య హసీన్ జహాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న హసీన్‌కు షమీ ప్రదర్శనపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది.
Vo zyada kamayega to hamara bhavishya secure hoga. Team India ko best wishes de sakti hu #shami ko nahi de sakti…..
Paisa le rahi hain madam lekin beti se Milne bhi nahi deti. Crazy how some women use children as a pawn so happily pic.twitter.com/QKMlvGDbFa
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 7, 2023
షమీ-హసీన్ జహాన్‌లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. కానీ 2018లో హసీన్.. షమీపై వేధింపుల కేసు నమోదుచేసింది. కొద్దిరోజుల క్రితమే గృహహింస కేసు కింద కోల్‌కతా కోర్టు.. షమీ, హసీన్‌కు నెలకు లక్షా ముప్పై వేల రూపాయలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. 2018 నుంచి ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

