సిడ్నీ: బోర్డర్ గవాస్క్ర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ (IND vs AUS) ఓటమి దిశగా పయణిస్తున్నది. ఏస్ పేసర్ బుమ్రా గైర్హాజరుతో బలహీనపడిన టీమ్ఇండియా బౌలింగ్‌ను ఆస్ట్రేలియా బ్యాటర్లు సులభంగా ఆడేస్తున్నారు. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.
మొదటి నుంచి ధారాలంగా పరుగులు ఇస్తున్న మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 10వ ఓవర్లో తొలి వికెట్ తీసుకున్నాడు. సెటిల్డ్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను (41) ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ 1వ బాల్‌కు పుల్‌షాట్ ఆటడానికి యత్నించి పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టెస్టుల్లో సిరాజ్ 100 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన మూడు వికెట్లను ప్రసిద్ధ్ కృష్ణ పడగొట్టాడు. తొలుత రన్స్ ఇచ్చినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రసిద్ధ్ ఆసీస్ బ్యాటర్లను ఔట్‌చేశాడు. కాగా, విజయానికి ఆస్ట్రేలియా మరో 51 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్నది.
HUNDRED Test wickets for Mohd. Siraj! 🔥🔥
Usman Khawaja is out for 41.
Live – https://t.co/NFmndHLfxu#TeamIndia | #AUSvIND | @mdsirajofficial pic.twitter.com/rJWTSdbvUD
— BCCI (@BCCI) January 5, 2025