లండన్ : కౌంటీ క్రికెట్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(5/82) అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వార్విక్షైర్ తరఫున ఆడుతున్న సిరాజ్ సోమర్‌సెట్‌తో పోరులో అయిదు వికెట్లు పడగొట్టి భళా అనిపించాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ఈ హైదరాబాదీ స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ కీలక వికెట్లు పడగొట్టాడు. కౌంటీల్లో ఆడుతున్నది తొలిసారి అయినా.. అనుభవజ్ఞుడిలా రాణించాడు. దీంతో సిరాజ్ దెబ్బకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన సోమర్సెట్ రెండో రోజు 219 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు 182 పరుగులు చేసిన వార్విక్షైర్ రెండో రోజు మరో 37 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్ ముగించింది. లూయిస్ గ్రెగరీ(60), సాజిద్‌ఖాన్(53) అర్ధ సెంచరీలతో రాణించారు.