దుబాయ్: భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ జాకిర్ వికెట్ తీసి తన ఖాతాలో కొత్త రికార్డును వేసుకున్నాడు షమీ. వన్డేల్లో 200 వికెట్లు తీసిన స్పీడ్ బౌలర్ అయ్యాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ మొత్తం 5126 బంతులు వేసి తన ఖాతాలోకి 200వ వికెట్ వేసుకున్నాడు. అయితే ఆసీస్ బౌలర్ స్టార్క్ 200 వికెట్లు తీసుకోవడానికి 5240 బంతులు వేయాల్సి వచ్చింది. కానీ అతి తక్కువ మ్యాచుల్లో స్టార్క్ ఆ రికార్డును అందుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత గాయపడ్డ షమీ.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు.
There’s the breakthrough! ⚡️
Mohd. Shami breaks the partnership as Virat Kohli takes his second catch of the innings 👌👌
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy pic.twitter.com/oMgE8B6IPt
— BCCI (@BCCI) February 20, 2025
అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి చేరుకున్న ఇండియన్ బౌలర్‌గా షమీ నిలిచాడు. అతను 104 మ్యాచుల్లో ఆ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకముందు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ 133 మ్యాచుల్లో ఆ రికార్డును అందుకున్నాడు. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కేవలం 102 మ్యాచుల్లో 200 వికెట్ల మైలురాయి దాటాడు. దీనికి తోడు ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటి వరకు షమీ తన ఖాతాలో 60 వికెట్లు వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీల్లో అతను మొత్తం 60 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో జహీర్ ఖాన్(59), జవగల్ శ్రీనాథ్(47), జడేజా(43) ఉన్నారు.
కోలుకున్న బంగ్లాదేశ్..
జాకిర్ అలీ, తౌహిద్ హృదయ్.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను పునర్ నిర్మించారు. ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో.. ఓ దశలో బంగ్లాదేశ్ 35 రన్స్‌కే అయిదు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఆరో వికెట్‌కు తౌహిద్, జాకిర్లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆరో వికెట్‌కు 153 రన్స్ జోడించారు. షమీ బౌలింగ్‌లో జాకిర్ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. జాకిర్ అలీ వ్యక్తిగతంగా 68 రన్స్ చేసి ఔటయ్యాడు. బంగ్లా 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది.