న్యూఢిల్లీ: ఏషియన్ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ కాంస్య పతకంతో సంతృప్తిపడ్డాడు. షెడ్యూల్ ప్రకారం గురువారం సెరిక్ తెమ్రిజనోవ్(కజకిస్థాన్)తో జరుగాల్సిన పురుషుల 57కిలోల బౌట్‌కు హుసామ్ గాయంతో దూరమయ్యాడు. క్వార్టర్స్ బౌట్ సందర్భంగా ఈ ఇందూరు బాక్సర్ కుడి కంటి పై భాగంలో గాయమైంది. దీన్నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సెమీస్‌కు వాకోవర్ ఇచ్చాడు. మిగతా బౌట్లలో స్టార్ బాక్సర్ శివ తాపా(63.5కి) 4-1 తేడాతో బక్దౌర్ ఉస్మనోవ్పై గెలిచి పసిడి పోరులో నిలిచాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన శివ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ అబ్దుల్లా రుస్లాన్తో శివ తలపడనున్నాడు. గోవింద్‌కుమార్ సహానీ (48కి), సుమిత్ (75కి), నరేందర్(92కి) ప్రత్యర్థుల చేతుల్లో ఓటములతో కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. శుక్రవారం ఐదుగురు మహిళా బాక్సర్లు మీనాక్షి, పర్వీన్, లవ్లీనా, సవీటి, అల్ఫియా ఫైనల్ బౌట్లలో తలపడుతారు.