ICC : పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్(Mohamad Nawaz)పై నిషేధం పడింది. ఐసీసీ నిషేధిత డ్రగ్ తీసుకున్నందుకు అతడు మూడు నెలలు సస్పెడ్ అయ్యాడు. భారత్, శ్రీలంక వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో నవాజ్ డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించించాడు. ఈ విషయంపై విచారణ చేపట్టిన ఐసీసీ.. నవాజ్‌పై నిషేధం విధించింది. అయితే.. అతడు పునరావాస కేంద్రంలో చికిత్సకు అంగీకరించడంతో సస్పెన్షన్‌ను ఒక నెలతో సరిపుచ్చింది ఐసీసీ.
ఈ ఏడాది ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ నవాజ్ నిషేధిత డ్రగ్ తీసుకున్నాడు. ఐసీసీ ఆధ్వర్యంలోని డ్రగ్స్ నిరోధక సంస్థ జాబితాలోని కార్బాక్సీ-టీహెచ్‌సీ(Carboxy-THC)ను నవాజ్ ఉపయోగించాడు. కొలంబోలో ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం పాక్ ఆల్‌రౌండర్ ఈ డ్రగ్ వినియోగించాడు. అతడి రక్త నమూనాల్లో ఈ డ్రగ్ కనిపించడంతో ఐసీసీ డ్రగ్ నిరోధక సంస్థ విచారణ చేపట్టింది.
With Mohammad Nawaz accepting the sanction and agreeing to a substance abuse treatment programme, his provisional suspension was lifted after having served a two-and-a-half-month suspension https://t.co/WEwiygiBGp pic.twitter.com/KdQ7k67ws2
— Cricinfo (@cricinfo) July 17, 2026
విచారణలో తన పొరపాటును అంగీకరించిన నవాజ్.. తాను శక్తికోసం ఈ నిషేధిత డ్రగ్‌ను తీసుకోలేదని వెల్లడించాడు. అయినా సరే అతడిపై మూడు నెలలు నిషేధం విధించింది ఐసీసీ. మే 1వ తేదీ నుంచి నవాజ్‌పై నిషేధం అమలులోకి రావాలి. అయితే.. ఐసీసీ అనుమతి ఉన్న కేంద్రంలో డ్రగ్స్ నుంచి బయటపడే చికిత్స తీసుకునేందుకు అంగీకరించాడు.

ఫలితంగా.. మూడు నెలలను కాస్త ఒక నెలకు కుదించింది ఐసీసీ. ఇప్పటికే పాక్ ఆటగాడు రెండున్నర నెలలు సస్పెన్షల్‌లో ఉన్నాడు. ఐసీసీ సూచన మేరకు చికిత్స తీసుకున్నందున అతడిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనుంది అత్యున్నత క్రికెట్ మండలి. అంతేకాదు.. వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్, ఆ తర్వాతి మ్యాచుల్లో నవాజ్ ప్రదర్శన(పరుగులు, వికెట్లు)ను పరిగణనలోకి తీసుకోవద్దని ఐసీసీ ఇప్పటికే నిర్ణయించింది.