హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న 11వ తెలంగాణ షూటింగ్ చాంపియన్షిప్లో మహమ్మద్ అక్రమ్ పసిడి పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల వ్యక్తిగత క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్ ఫైనల్లో అక్రమ్(39) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
ఇదే విభాగంలో కయ్మార్జ్(38), జోహైర్ హసన్(38) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్(ఎస్-19)లో అహ్మద్ ముక్తారుద్దీన్(40) స్వర్ణం సాధించాడు. పురుషుల మాస్టర్ క్లే పీజియన్ ట్రాప్ కేటగిరీలో ముజాహిద్ అలీఖాన్(40) పసిడి కైవసం చేసుకోగా, ఫజల్(40), చేతన్రెడ్డి(35) రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.