ఓవల్ : మొహమ్మద్ సిరాజ్( Mohammed Siraj)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఓవల్ టెస్టులో అతను మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడతను. మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉందన్నాడు. తొలి రోజు నుంచి అయిదో రోజు వరకు తీవ్రంగా పోరాడినట్లు చెప్పాడు. లైన్లో బౌలింగ్ చేసి, వత్తిడి పెంచాలన్న ఉద్దేశంతోనే బౌలింగ్ చేసినట్లు చెప్పాడు. ఇవాళ ఉదయం నిద్ర లేవగానే, ఆ పని చేయగలనన్న ఉద్దేశంతో మైదానంలోకి అడుగు పెట్టినట్లు తెలిపాడు. బిలీవ్.. నమ్మకం అన్న పిక్‌ను గూగుల్ నుంచి ఇవాళ ఉదయం డౌనలోడ్ చేసుకున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. వాస్తవానికి బ్రూక్ క్యాచ్‌ను జారవిరచడం పెద్ద పొరపాటే అన్నాడు. ఒకవేళ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే, బహుశా ఇవాళ ఉదయం మళ్లీ పిచ్‌లోకి అడుగుపెట్టేవాళ్లం కాదు అన్నాడు. కానీ బ్రూక్ చాలా అద్భుతంగా అటాక్ చేశాడని, అతని బ్యాటింగ్‌కు హ్యాట్సాప్ చెబుతున్నట్లు సిరాజ్ పేర్కొన్నాడు.
𝗧𝗛𝗘 𝗥𝗘𝗗𝗘𝗠𝗣𝗧𝗜𝗢𝗡 for Mohammed Siraj 🤩
#WTC27 | 📝 #ENGvIND: https://t.co/SNl4Ym0LJt pic.twitter.com/MuLTmh7ins
— ICC (@ICC) August 4, 2025
ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 104 రన్స్ ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆఖరి రోజు ఇంగ్లండ్ టెయిలెండర్లను తీవ్ర వత్తిడిలోకి నెట్టాడతను. జేమీ స్మిత్, ఓవర్టన్, అట్కిన్సన్ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుని ఇండియాకు అద్భుత విజయాన్ని సిరాజ్ అందించాడు. బుమ్రా లేని లోటును సిరాజ్ తీర్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతను 86 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పిచ్‌కు తగినట్లు బంతిని స్వింగ్ చేశాడు సిరాజ్. ఇంగ్లండ్ బ్యాటర్లను టీజ్ చేస్తూ.. మ్యాచ్‌లో టెన్షన్ పుట్టించాడు.
A heroic 5️⃣-for from Mohammed Siraj at The Oval 🏆🔥#WTC27 #ENGvIND 📝: https://t.co/SNl4Ym0LJt pic.twitter.com/7xQGshXe6m
— ICC (@ICC) August 4, 2025